Natyam ad

పుంగనూరులో గడప గడపకు ఘన స్వాగతం- ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడప గడపకు కార్యక్రమానికి మండలంలో అపూర్వ స్పందన లభించింది. గురువారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , మంత్రి పీఏ చంద్రహాస్‌ , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి కలసి మాగాండ్లపల్లె , మద్దనపల్లె, భరిణేపల్లె గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. మేళతాళాలతో, బాణసంచాలతో వైఎస్సార్‌సీపీ రంగుబెలూన్లను వీధుల్లో కట్టి స్వాగతం పలికారు. ఎంపీపీ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి జగనన్న బావుట పుస్తకాలను అందజేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోను అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. అలాగే గ్రామాలకు సీసీ రోడ్లు, కాలువలు ఏర్పాటు చేసి, మంచినీటి సమస్య తీర్చేందుకు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రజలకు అవసరమైన సమస్యలను అక్కడిక్కడే గుర్తించి పరిష్కరించడం జరుగుతోందన్నారు. రైతుల కోసం ఆర్‌బికెలు ఏర్పాటు చేసి, సలహాలు, సూచనలు ఇచ్చి రైతాంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందని కొనియాడారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గంగాధర్‌, ఎంపీటీసీ నాగభూషణ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, మల్లప్ప, బాలాజి, శ్రీరాములురెడ్డి, ప్రకాష్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: A warm welcome to Gadapa Gadapa in Punganur- MPP Bhaskar Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.