Natyam ad

ట్రైన్ ఢీకొని మహిళ,ఆమె కొడుకు ఇద్దరు దుర్మరణం.

నెల్లూరు  ముచ్చట్లు:

కావలిలో ఎన్నికల విధులకు వెళుతూ ట్రైన్ ఢీకొని మహిళ,ఆమె కొడుకు ఇద్దరి దుర్మరణం.తల్లిని కాపాడుబోయి ఆమె కొడుకు విజయ్ అనే యువకుడు కూడా అక్కడికక్కడే మృతి.సైదాపురం మండలం ఛాగణం గ్రామానికి చెందిన బట్టా సుభాషిని సుమారు(55) అనే మహిళకు కావలిలో ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు.ఈ ఉదయం తన స్వస్థలం చాగాణం నా నుండి సుభాషిని ఆమె కొడుకు విజయ్  కావలికి చేరుకుని కావలి లో రైల్వే ట్రాక్ దాటే క్రమంలో  రైలు వస్తుండడాన్ని గమనించని సుభాషిణి రైల్ ట్రాక్ పైకి పొగా ఆమెను  కాపాడబోయి ఆమె కొడుకు విజయ్(19) కూడా అక్కడికక్కడే మృతి.

 

 

Post Midle

సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బట్టా సుభాషిని అనే మహిళ అంగన్వాడి లో ఆయగా విధులు నిర్వహిస్తుంది, ఈ క్రమంలో ఎన్నికల విధులను కావాలి లో వేయడ తో ఈ ఉదయం తన కొడుకు విజయ్ తో కలిసి సుభాషిని గూడూరు నుండి రైలులో కావలికి చేరుకొని అక్కడ స్టేషన్లో  ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు రావడం అది చూసి తల్లిని కాపాడబోయిన విజయ్ కూడా ట్రక్ పైకి పోవడంతో ఇద్దరినీ రైలు ఢీ కొన్నట్టు దీంతో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మరణించినట్టు సమాచారం, వయసు రీత్యా,మహిళా ప్రాధాన్యత చూసుకుని ఎన్నికల విధులు కేటాయించే సమయంలో వారిని దగ్గర్లోని పోలింగ్ స్టేషన్లో వద్ద విధులు కేటాయించి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని,

 

 

కానీ అధికారులు సుమారు 120 కిలోమీటర్ల  సుదూర ప్రాంతాల్లో ఎన్నికల విధులు వేయడం వల్ల వారు ఒత్తిడికి గురికావడం, హడావిడిలో ఆరోగ్య సమస్యలతో పాటు ఇలా ప్రాణాలు కూడా పోతున్నాయని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Tags:A woman and her son died in a train collision.

Post Midle