అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న మహిళ

మగగొంతుతో అమ్మాయిల ట్రాప్

Date:08/11/2019

ఒంగోలు ముచ్చట్లు:

చిత్రమని షాకవ్వకండి. మీరు వింటున్నది నిజమే.. ప్రేమ పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న మహిళ.. వాళ్ల జీవితాలను నాశనం చేస్తోంది. సెక్స్ టాయ్స్‌తో పైశాచికానందం పొందుతూ.. ఆమె ప్రియుడు, మరో స్నేహితుడితో కలిసి బాలికలు, అమ్మాయిలపై అత్యాచారాలకు ఒడిగట్టిస్తోంది. ధైర్యం చేసిన ఓ బాలిక కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ అరాచకం బయటపడింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనతో జిల్లా కలెక్టర్‌తో పాటూ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంకు చెందిన సుమలతకు వివాహం అయ్యింది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్తను వదిలేసి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఏడుకొండలు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా.. ఏడేళ్లుగా అతడితో సహజీవనం చేస్తోంది. ఈ జంట మూడు నెలల క్రితం ఒంగోలు మారుతీనగర్‌కు చేరారు. అక్కడే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. తర్వాత ఏడుకొండలు, సుమలతలకు వంశీ అనే మరో యువకుడు పరిచయం అయ్యాడు. వంశీ ఒంగోలులో సిమ్‌కార్డులు విక్రయిస్తుండేవాడు.అసలు స్టోరీ ఇక్కడే మొదలయ్యింది. వంశీ తన దగ్గరకు వచ్చే యువతులు, బాలికల ఫోన్ నంబర్లు సేకరించేవాడు.. అవి తీసుకెళ్లి ఏడుకొండలకు ఇచ్చేవాడు. ఆ నంబర్లు తర్వాత సుమలత దగ్గరకు చేరేవి. ఆమె తన పేరు సాయితేజారెడ్డిగా మార్చుకొని.. మగ గొంతుతో మాట్లాడి అమ్మాయిలు, బాలికల్ని ట్రాప్ చేసేది. మారుతీనగర్‌లోని ఆమె నివాసానికి రమ్మని పిలిచేది.. అక్కడికి నమ్మి వెళ్లిన అమ్మాయిలకు సెక్స్ టాయ్స్‌తో తన శృంగార వాంఛతో నరకం చూపించేది. సుమలత ట్రాప్ చేసిన అమ్మాయిలు, బాలికలపై ఏడుకొండలు, వంశీ కూడా అత్యాచారం చేసేవారు.

 

 

 

 

 

 

 

పెళ్లి కాని యువతులు, కాలేజీ విద్యార్థినులు, బాలికల్ని ట్రాప్ చేశారు. బాధితులంతా పరువు పొతుందని భావించడంతో ఈ అరాచకాలు బయటకు రాలేదు.ఈ క్రమంలో ఈనెల 2న సుమలత, ఏడుకొండలు ఓ బాలికను ట్రాప్ చేసి.. ఒంగోలు మారుతీ నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. ఆ బాలికకురెండు రోజులు మత్తు మందు ఇచ్చి సెక్స్‌ టాయ్స్‌తో వికృత చేష్టలు చేసింది. తర్వాత ఆ బాలిక ఈ ఘటన నుంచి తేరుకొని నాలుగు రోజుల క్రితం నేరుగా వెళ్లి జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు రోజుల క్రితం సుమలత, వంశీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ఏడుకొండలు మాత్రం దొరకలేదు. సుమలత ప్రియుడు ఏడుకొండల్ని మారుతీ నగర్‌లోని ఇంట్లో అదుపులో తీసుకుంటున్న సమయంలో.. కొన్ని సెక్స్ టాయ్స్ సీజ్ చేశారు. పోలీసులు రావడంతో భయపడిన ఏడుకొండలు బిల్డింగ్ పై నుంచి దూకాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు. బాలిక చెప్పిన స్టోరీ మొత్తం విన్న పోలీసులకే దిమ్మ తిరిగింది. తన మీదే కాదు.. ఇంకా చాలామందిపై అఘాయిత్యాలకు ఒడిగట్టారని బాధిత బాలిక ఆరోపిస్తోంది.

 

మీసం మెలేయలేకపోయిన విష్ణు

 

Tags:A woman trapping Ammail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *