ప్రమాదానికి గురై  కాలు కోల్పోయిన మహిళ

-పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే ప్రసన్న

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా, సంగం  మండలం, ఉడ్ హౌస్ పేట తరుణవాయి పంచాయతీకి చెందిన డి. రాజమ్మ ఆత్మకూరు ఉప ఎన్నికలలో భాగంగా గురువారం ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది .ఆమెకు ఒక కాలు తీసివేశారు .ప్రస్తుతం ఆమె నెల్లూరు లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకుని ఆమెను పరామర్శించి స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్టు తరఫున ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రూ.1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోవూరు నుంచి బుచ్చికి మోటార్ బైక్ పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన అడ్వకేట్ గూడూరు సుబ్బారెడ్డిని మరియు వారితో కలిసి వారితో ప్రయాణం చేస్తూ గాయపడిన అడ్వకేట్ అశోక్ ని ఈ సందర్భంగా పరామర్శించారు.కోవూరు శాసనసభ్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తో పాటు జిల్లా డి ఏ ఏ బి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి , కోవూరు మండల ఏ ఏ బి ఛైర్మన్ నిలపురెడ్డి హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: A woman who lost a leg in an accident

Leave A Reply

Your email address will not be published.