44 మంది పిల్లలను కన్న మహిళ

-ఇక చాలు, ఆపాలంటూ ప్రభుత్వం ఆదేశం.

 

ఉగాండా ముచ్చట్లు :

 

40 ఏళ్ల వయస్సుకే 44 మంది పిల్లలను కన్న ఆమె.. ప్రభుత్వ ఆదేశాలతో వెనక్కి తగ్గింది . వయస్సుతో సమానంగా అంతమంది పిల్లలను ఆమె ఎలా కన్నది..? అదెలా సాధ్యమైందో చూడండి .ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలను పోషించడమే కష్టంగా ఉంటుంది . అలాంటిది ఆమె ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది . ఆమెను అలాగే వదిలేస్తే అర్థ శతకం చేస్తుందని భావించిన ప్రభుత్వం..ఇక పిల్లలను కనడం ఆపాలంటూ ఆదేశించింది . ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులు సైతం అప్రమత్తమయ్యారు . ఆమె గర్భాశయాన్ని తొలగించాలని ఆదేశించింది .

 

40 ఏళ్లకే 44 మంది పిల్లలు…

ఉగాండాకు చెందిన 40 ఏళ్ల మరియం కు 44 మంది పిల్లలు ఉన్నారు . వీరంతా ఆమెకు పుట్టిన బిడ్డలే . పిల్లలను కనాలంటే కనీసం తొమ్మిది నెలలు పడుతుంది . మరి 40 ఏళ్ల వయస్సులో 44 మంది ఎలా కనేసింది..? ఇది ఫేక్ అనుకుంటున్నారా.. అయితే ఆమెకు ఉన్న సమస్య గురించి తెలుసుకోవల్సిందే .

అరుదైన అండాశయం..

మరియం కు 12 ఏళ్లకే పెళ్లి జరిగింది . 13వ ఏటే ఆమెకు కవల పిల్లలు జన్మించారు . దీంతో ఆమె వైద్యులను సంప్రదించి గర్భ నివారణ చేయాలని కోరింది . ఈ సందర్భంగా ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అది సాధ్యం కాదని చెప్పారు . పైగా ఆమె అండాశయాలు చాలా పెద్దవని భవిష్యత్తు లో మరింత మంది కవలలు పుట్టే అవకాశం ఉందన్నారు . చివరికి వైద్యులు చెప్పినట్లే జరిగింది . ఆమె గర్భాశయం లో ఒకేసారి అనేక అండాలు విడుదల కావడం వల్ల ఆమెకు ఒకేసారి ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు చొప్పున జన్మించారు .

38 మందే మిగిలారు

తొలి కాన్పులో కవలలకు జన్మనిచ్చిన ఆమె.. ఆ తర్వాత 5 సార్లు కవలలు , ఏడు సార్లు ముగ్గురేసి , ఐదుసార్లు నలుగురేసి పిల్లలకు జన్మనిచ్చింది . అలా 40 మందికి ఆమె జన్మనిచ్చింది . వీరిలో కొందరు పుట్టగానే చనిపోవడంతో ప్రస్తుతం 38 పిల్లలే ఉన్నారు . మూడేళ్ల కిందట భర్త ఆమెను వదిలేశాడు . దీంతో ఆ 38 మంది పిల్లలను పోషించే బాధ్యత ఆమెపైనే పడింది .

భర్తకు 45 మంది పిల్లలు..

రోజుకు సుమారు 25 కిలోల గోదుమ పిండి ఖర్చవుతుందని ఆమె ఓ వార్త సంస్థకు వెల్లడించింది . వారిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నానని తెలిపింది . మళ్లీ గర్భం దాల్చితే తన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారని తెలిపింది . అయితే తన గర్భాశయం తొలగించడం అంత సులభమైన పని కాదని వైద్యులు చెప్పారని తెలిపింది . తన భర్త ఈ 38 మంది పిల్లలే కాకుండా వేర్వేరు మహిళలతో ద్వారా 45 మందిని కన్నాడని పేర్కొంది .

చిత్రం ఏమిటంటే..

ఆ 38 పిల్లలను ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంటుంది . స్కూల్‌కు పంపి చదివిస్తోంది . ఆ ఇంట్లో గోడలపై మెడల్స్ సాధించిన తన చిన్నారుల ఫొటోలు గర్వంగా పలకరిస్తాయి . ఈమె పరిస్థితి చూసి ప్రభుత్వం ఆదుకోడానికి ప్రయత్నిస్తోంది . అయితే.. ఇకపై పిల్లలను కనకూడదనే షరతు విధించింది . ప్రపంచంలో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న దేశాల్లో ఉగాండా కూడా ఒకటి . అక్కడ సంతాన నియంత్రణపై ప్రజలకు కనీస అవగాహన ఉండదు . ఫలితంగా అక్కడ జనాభాతోనే పేదరికం కూడా బాగా పెరుగుతోంది .

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: A woman with 44 children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *