Natyam ad

మహిళ అస్థిపంజరం కలకలం

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలో మహిళ అస్థిపంజరం కలకలం రేపింది. నగరంలోని మధురవాడ కొమ్మాది వికలాంగుల కాలనీలో నీళ్ల డ్రమ్ములో కుళ్లిన స్థితిలో అస్థిపంజరం లభించడంతో స్ధానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.నండూరి రమేష్ అనే వ్యక్తి ఎండాడలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు.. ఆయనకు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రుషి అనే వ్యక్తి రమేష్ దగ్గర పనికి చేరాడు. దీంతో రమేస్ రుషి కుటుంబం ఉండేందుకుకాలనీలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. ఆ ఇంట్లో రుషితో పాటు అతడి భార్య, కూతురు ఉండేవాళ్లు.రుషి భార్య గర్భవతి కావడంతో రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లడంతో ఇంటిని ఖాళీ చేశాడు.ఈ క్రమంతో ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే యజమాని రమేష్ JI సమాచారం ఇచ్చారు. ఆయన ఇంటి తాళం తీసి చూడగా నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఏసీపీ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.డ్రమ్ములో మృతి చెందిన మహిళ.. గతంలో ఆ ఇంట్లో అద్దెకు ఉన్నవారా.. లేక ఇంకెవరినైనా హత్య చేసి డెడ్బాడీని తెచ్చి ఇక్కడ దాచారా అని అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని రమేష్ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: A woman’s skeleton is shaken

Post Midle
Post Midle