పసలేని ఆరోపణలతో “పనికట్టుకుని” తిరుగుతున్న “చింతా”

పసలేని ఆరోపణలతో “పనికట్టుకుని” తిరుగుతున్న “చింతా”

గూడూరు ముచ్చట్లు:

… “పోలీసు” పై చింతా “అక్కసు” లో “ఆంతర్యం” ఏమిటో?!”విజ్ఞత” లేని ఆరోపణలు తో ఎన్నికల వేళ ప్రజల్లో అపోహలు సృష్టించడం తగదు . పోలీస్ అధికారుల ఆవేదన గూడూరు(షోకాజ్ న్యూస్): “మాటల మాంత్రికుడి”గా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న “హామీల బ్రహ్మ” చింతా మోహన్ “కొత్త పాట” పాడుతున్నారు.పదే పదే గూడూరు పోలీస్ లే లక్ష్యంగా పసలేని ఆరోపణలు తో పనిగట్టుకుని తిరుగుతున్నాడు.45కోట్లు వైకాపా ఎన్నికల సొమ్ము గూడూరు రెండవ పట్టణ పరిధిలోని ఓ లాడ్జి కేంద్రం గా ఖర్చు చేశారని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ ఆరోపిస్తున్నారు.మీడియా లో ప్రముఖంగా కనిపించాలంటే బలమైన ఆరోపణలు తోనే అవకాశం ఉంటుందని “చింతా” గట్టిగా “గాల్లో బాణాలు” వదిలేస్తున్నారు.ఈయన గారి “టైం పాస్ పాలిట్రిక్స్ ” కు పోలీస్ శాఖను ఎంచుకోవడంతో ఆ శాఖ అధికారులు అసహనానికి గురవుతున్నారు.

 

ఆరోపణలు చేసే క్రమం లో విజ్ఞతో వ్యవహారిస్తే హుందాగా ఉంటుందని “పోలీసు వారు” సెలవిస్తున్నారు.ఆధారాలు ఉంటే ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయాలే కానీ “ఈ ఆటవిడుపు ” రాజకీయం ఏంది సారూ!!అంటున్నారు.చింతా సారేమో!!”కాస్తంత జాలి”తో లోతుల్లోకి వెళ్లడం లేదంటున్నారు.ఇదిలా ఉండగా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చింతా తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. చింతా సారూ!! మీరు కూడా నీతి వాఖ్యలు వల్లిస్తే ఎలా?? తిరుపతి పార్లమెంట్ కు ఏపీసీసీ నుంచి వచ్చిన ఎన్నికల వ్యయం ఎంత?? అభ్యర్థులకు ఎంత మేరకు “కోతేసి” తమరు అందించారో!? అది కూడా మీడియా ద్వారా సమాజానికి సెలవివ్వండి అంటున్నారు.

 

Tags:A “worry” who is “preoccupied” with frivolous accusations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *