Natyam ad

శ్రీ కూర్మ ఆలయంలో నిత్యాన్నదానానికి ఏడాది

శ్రీకాకుళం ముచ్చట్లు:

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీకూర్మం దేవస్థానంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు  చొరవతో ప్రారంభించిన  నిత్యాన్నదాన కార్యక్రమానికి  ఏడాది పూర్తయిన వేళ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకూ, యాత్రికులకూ భోజన వసతి కల్పించడం ఆనందంగా ఉంది. దాతల సహకారంతో ఇటువంటి సమున్నత కార్యక్రమం ఏర్పాటు చేయగలిగాం. ఇందుకు సంబంధించి ట్రస్టు ఏర్పాటు చేసి,ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా చేస్తున్నాం. ఈ విషయమై ట్రస్టు బోర్డు మెంబర్లు చేస్తున్న కృషి ఎంతో సమర్థంగా ఉంది. వారి కృషి కారణంగానే రుచికరమైన, శుచికరమైన భోజనం అందించగలుగుతున్నాం. భోజనం విసుగుతో కాకుండా ప్రేమతో పెట్టాలి. అభిమానంతో పెట్టాలి. అతిథిని ప్రత్యేకించి గౌరవించి భోజనం పెట్టాలి. ఆ విధంగా ఇక్కడ నిత్యాన్నదానం చేస్తున్నవారు నడుచుకోవాలి.నిత్యాన్నదాన పథకం నిర్వహణ కోసం బ్యాంకులో జమ చేసిన డిపాజిట్ (సుమారు ఎనభై లక్షల రూపాయలు)ను మరింత పెంచేందుకు చాలా మంది ఆసక్తి గా ఉన్నారు. దాతల పేర్లు చెబుతూ ఇక్కడ నిత్యాన్నదానం చేస్తూ ఉన్నారు.

 

 

ఇదెంతో మంచి కార్యక్రమం. జిల్లాలో ఉన్న వారంతా ఇందులో పాల్గొనాలి. అన్నదానం ద్వారా దక్కే గౌరవం మరో చోట దక్కదు. ఆ గౌరవాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా వాసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.పాలక మండలి సభ్యులు డబ్బిరు శ్రీనివాస్, ముజేటి అప్పల కొండ, బోర కృష్ణ వేణి, కొనాడ లక్ష్మి, అనుపోజు నాగరాజు, ఉప్పాడ రమేష్, పుడి కమల, గొరు శ్యామల రావు, సిహెచ్ఎస్ఎన్ ఆచార్యులు, పొన్నాడ ఋషిశ్వరరావు,ఎంపిపి గోండు రఘురాం, సర్పంచ్ గోరు అనిత, యల్లా నారాయణ, కొయ్యన నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; A year of daily donation in Sri Kurma temple

Post Midle