అసెంబ్లీలో స్పీక‌ర్‌ పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యేల‌పై ఏడాది పాటువేటు

ముంబై   ముచ్చట్లు:
మ‌హారాష్ట్ర అసెంబ్లీలో స్పీక‌ర్‌ను దుర్భాష‌లాడుతూ, చేయి చేసుకున్న 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌పై ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. సోమ‌వార‌మే మ‌హారాష్ట్ర అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే ఆ గొడ‌వ స‌మ‌యంలో అసెంబ్లీలోనే ఉన్న ప్ర‌తిప‌క్ష నేత దేవేంద్ర ఫ‌డ్నవీస్ మాత్రం ఇవ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని కొట్టిపారేశారు. లేని స్టోరీని క్రియేట్ చేశారు. బీజేపీ త‌ర‌ఫున ఎవ‌రూ ఇలాంటి ప‌నికి పాల్ప‌డ‌లేదు అని ఫ‌డ్న‌వీస్ మీడియాకు చెప్పారు. ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం తాము 12 మంది ఎమ్మెల్యేల‌ను త్యాగం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న అన్నారు. ఈ అసెంబ్లీ సెష‌న్‌లో బీజేపీ లేవ‌నెత్త‌బోయే ప్ర‌ధాన అంశాల్లో ఇది కూడా ఒక‌టి. స‌స్పెండైన ఎమ్మెల్యేల‌లో సంజ‌య్ కూటె, ఆశిష్ షేల‌ర్‌, అభిమ‌న్యు ప‌వార్‌, గిరీశ్ మ‌హాజ‌న్‌, అతుల్ భ‌త్కాల్క‌ర్‌, ప‌రాగ్ అలావ్నీ, హ‌రీష్ పింపాలే, రామ్ స‌త్పుటే, విజ‌య్‌కుమార్ రావ‌ల్‌, యోగేశ్ సాగ‌ర్‌, నారాయ‌ణ్ కూచె, కీర్తికుమార్ బాంగ్డియా ఉన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:A year on BJP MLAs who got their hands on the speaker in the assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *