భార్య తిట్టిందని సెల్ఫోన్ టవర్ ఎక్కిన యువకుడు.

శ్రీకాకుళం ముచ్చట్లు:

మండల కేంద్రం మందస బోయి వీధికి చెందిన చెల్లూరి గోపి అనే వ్యక్తి సెల్ఫోన్ పోగొట్టుకున్నాడు.ఇంటికి వెళ్లిన అనంతరం భార్య ధనం మందలించడంతో మనస్థాపానికి గురై మద్యం మత్తులో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ పైకెక్కి హల్చల్ చేశాడు.సమాచారం తెలుసుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.సెల్ టవర్ పైనున్న గోపికి నచ్చజెప్పారు.ఎట్టకేలకు స్పందించిన చెల్లూరు గోపి టవర్పై నుంచి కిందకు దిగడంతో కౌన్సిలింగ్ చేశారు.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

Post Midle

Tags: A young man climbed a cell phone tower because his wife scolded him.

Post Midle