యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య

కురబలకోట ముచ్చట్లు:

కురబలకోట రైల్వే స్టేషన్ వద్ద సింగన్నగారిపల్లె యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యచేసుకున్న విషాదకర సంఘటన శనివారం మధ్యాహ్నం వెలుగు చూసింది. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని కురబలకోట మండలం, సింగన్నగారిపల్లెకు చెందిన లేట్ వెంకటరమణ కుమారుడు కన్నెమడుగు గిరిబాబు (37), గత ఐదేళ్లుగా టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన గిరిబాబు కురబలకోట రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. స్థానికులు గుర్తించి కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనా స్థలం వద్దకు చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Tags:A young man commits suicide by falling down a train

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *