కురబలకోట రైల్వే స్టేషన్లో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

తంబళ్లపల్లె ముచ్చట్లు:

కురబలకోట రైల్వే స్టేషన్లో సుమారు 25 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ భాష కథనం మేరకు.. అర్ధరాత్రి సమయంలో రైలు కింద పడి కురబలకోట రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు సమీపంలో గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండడాన్ని శనివారం ఉదయం స్థానిక రైల్వే సిబ్బంది గుర్తించి సమాచారం అందించారన్నారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకునే మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్ట్మార్టం కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చరీకి తరలించినట్లు చెప్పారు. చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియ రాలేదని వివరాలు తెలిస్తే తన ఫోన్ నెంబర్ 9133109537 కు సమాచారం అందించాలని కోరారు.

 

Tags: A young man committed suicide after being hit by a train at Kurabalakota railway station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *