పుంగనూరులో లారీపై నుంచి పడి యువకుడు మృతి

పుంగనూరు ముచ్చట్లు:

ఎర్రగడ్డల లారీ అతివేగంగా వెళ్లడంతో మూటలపై ఉన్న చాంద్‌బాషా(36) క్రింద పడి మృతి చెందిన సంఘటన మంగళవారం వేకువజామున జరిగింది. పట్టణంలోని సనావుల్లాకాంపౌండుకు చెందిన చాంద్‌బాషా ఎర్రగడ్డల లోడ్డు భర్తీ చేసి లారీపై కుర్చున్నాడు. లారీ పీలేరుకు వెళ్తూ పుంగనూరు సమీపంలోని చదళ్ల వద్ద అతివేగ ంగా వెళ్లడంతో చాంద్‌బాషా అదుపుతప్పి క్రిందపడ్డాడు. వెంటనే బాధితున్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తర లించి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: A young man died after falling from a lorry in Punganur

Leave A Reply

Your email address will not be published.