పుంగనూరు రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని మేలుపట్లలో నివాసం ఉన్న హరినాథ్ కుమారుడు మధుబాబు(23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మేలుపట్లకు చెందిన శ్రీహరి అనే వ్యక్తి, మధుబాబు ద్విచక్రవాహనంపై గురువారం మండలంలోని గొల్లపల్లె గ్రామానికి సంక్రాంతి పండుగకు వెళ్లారు. పండుగ చూసుకుని శ్రీహరి ద్విచక్రవాహనం నడుపుతుండగా మధుబాబు వెనుకవైపు కుర్చోని ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో పట్టణ సమీపంలోని మేలుపట్ల వద్దకు రాగా ముందు ద్విచక్రవాహనంపై వెళ్తున్న రెడ్డెప్ప వాహనాన్ని శ్రీహరివాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు క్రింద పడ్డాయి.శ్రీహరికి స్వల్పగాయాలు కాగా మధుబాబు తలకుతీవ్రమైన గాయాలుకావడంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మధుబాబు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: A young man died in a Punganur road accident
