పుంగనూరులో అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కట్టక్రిందపాళ్యెంలో నివాసం ఉన్న నారాయణప్ప కుమారుడు సురేష్(20 ) అనుమానస్పద స్థితిలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మృతుడు సురేష్ మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలసి వెళ్లినట్లు సోదరుడు గంగాధర్ తెలిపాడు. బుధవారం మండలంలోని ఎ.కొత్తకోట వద్ద తీవ్ర రక్త గాయాలతో పడిఉండగా గ్రామస్తులు కనుగొని సమాచారం అందించడంతో హుఠాహుఠిన సురేష్‌ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి , కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags; A young man died in a suspicious condition in Punganur
