Natyam ad

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

అన్నమయ్య ముచ్చట్లు;

బి కొత్తకోట పోలీసు పరిధిలో ఒక యువకుడు విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. మృతుడు పిటిఎం మండలం టి. సదుం కు చెందిన తలారి జయచంద్ర(28). ఇంటి ఆవరణంలోని అల్లనేరేడు కాయల కోయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే జయచంద్ర మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Post Midle

Tags:A young man died of electric shock

Post Midle