మదనపల్లిలో డాక్టర్ నిర్లక్ష్యం కాలు పోగొట్టుకున్న యువకుడు
మదనపల్లి ముచ్చట్లు:
చిన్న గాయమైందని హాస్పిటల్ కి వెళ్ళిన యువకుడికి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కాలు పోగొట్టుకున్న సంఘటన మదనపల్లిలో చోటు చేసుకుందనీ… ఆరోపించిన కుటుంబ సభ్యులు.. మదనపల్లి పట్టణం స్థానిక నీరుగొట్టువారిపల్లికి చెందిన శంకర,శశికళ దంపతుల కుమారుడు రెడ్డి శేఖర్ మే 29న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో ఎడమ కాలికి గాయం కావడంతో మదనపల్లిలోని విశ్వ ఆర్థోపెడిక్ హాస్పిటల్ కి తరలించారు.. హాస్పిటల్స్ సిబ్బంది ప్రధమ చికిత్స అనంతరం కాలికి కట్టుకట్టి ఇంటికి పంపించారు. నాలుగు రోజులు తరువాత కాలు బాగా వాపు రావడంతో కుటుంబ సభ్యులు రెడీ శేఖర్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వహించడంతో యువకుడి పరిస్థితి విషమించింది, మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఎమ్మెస్ రామయ్య ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు, అప్పటికే తీవ్రంగా ఇన్ఫెక్షన్కు గురైన కాలును తొలగించాలని బెంగళూరు హాస్పిటల్ వైద్యులు కుటుంబ సభ్యులకి తెలిపారు, చేసేదిలేక మదనపల్లి హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యానికి యువకుడు కాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందనీ కుటుంబ సభ్యులు ఆరోపించారు.. తమ బిడ్డ కాలు పోవడానికి బాధ్యులైన హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రజాసంఘాలతో కలిసి ఆస్పత్రి ఎదురుగా నిరసన తెలియజేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Tags: A young man lost his leg due to doctor’s negligence in Madanapally