మదనపల్లెలో యువకుడు దారుణ హత్య

మదనపల్లి ముచ్చట్లు:

భార్య ముందే భర్తను అతి కిరాతకంగా నరికిన దుండగులుహత్యకు పాల్పడింది మదనపల్లె కు చెందిన దందాల ముఠానేయువకుని హత్యతో ఉలిక్కిపడ్డ మదనపల్లెఓ యువకుడని తన భార్య ఎదుట దారుణ హత్యకు గురి అయిన సంఘటన శనివారం వేకువుజమున అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీవారి నగర్ లో చోటు చేసుకొంది.మదనపల్లిలో దంతాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు 20 మందికి పైగా వెళ్లి గేటు బీగాలు పగలగొట్టి తలుపులు ధ్వంసం చేసి, ఇంట్లో నిద్రిస్తున్న రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు(25)ను కత్తులు వేటకుడవలతో అతి కిరాతకంగా నరికి హతమార్చారు.

 

ఘటన సమాచారం అందుకున్న మదనపల్లి డి.ఎస్.పి ప్రసాద్ రెడ్డి, వన్ టౌన్, టూ టౌన్, రూరల్ సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.పంచినామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు.

Tags:A young man was brutally murdered in Madanapalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *