కారు ఢీకొని యువకుడికి గాయాలు

A young man was injured in a collision with a car

A young man was injured in a collision with a car

Date:25/11/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండలపరిధిలోని బ్రాహ్మణపల్లె వద్ద ఆదివారం కారు ఢీకొనడంతో యువకుడు గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు… బ్రాహ్మణపల్లె కు చెందిన శరత్ బాబు అనే యువకుడు లింగాపురం హేచరీస్ లో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం డ్యూటీ నిమిత్తం తన ద్విచక్రవాహనంలో లింగాపురం హేచరీస్ కి వెళ్తుండగా బ్రాహ్మణపల్లె వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శరత్ బాబు తలకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది కిషోర్, నరసింహ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని 108 అంబులెన్సు లో చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా జిల్లాకు నీరు

Tags:A young man was injured in a collision with a car

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *