పెళ్లి వద్దని యువతి ఆత్మహత్య

Date:11/05/2019
నాగర్ కర్నూలు ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ జిల్లా మంతటి గ్రామంలో నచ్చని వివాహం చేస్తున్నారని ఒక యువతి  ఆత్మహత్య చేసుకుంది. నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన మహేశ్వరి అనే యువతి టిటిసి  ప్రథమ సంవత్సరం చదువుతుంది. అదే గ్రామంలో  ఒక ఓ యువకునితో కొంత చనువుగా ఉండటం తో గమనించిన తల్లిదండ్రులు మహేశ్వరి మందలించారు. మహేశ్వరి తండ్రి విష్ణు రెండెకరాల పొలం అమ్మి ఆ డబ్బుతో మహేశ్వరి పెళ్లి ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో లో మహేశ్వరి మేనమామ అయిన తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన పరుశురాం అనే యువకుడితో ఈ నెల 17న వివాహం నిశ్చయించుకున్నారు.  పెళ్లి పనుల్లో తల్లి బంధువులు ఉండగా తండ్రి పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్ళాడు. తనకి ఇష్టం లేని వివాహం చేస్తున్నారని బాధతో మహేశ్వరి తన ఇంట్లో పడుకొని ఉండగానే ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి మహేశ్వరిని గమనించిన తల్లి,  బంధువులు హుటాహుటిన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె    అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో బంధువుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Tags: A young woman at the wedding is suicidal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *