Natyam ad

 నీటి సంపులో దూకి యువతి ఆత్మహత్య

మదనపల్లె ముచ్చట్లు:

నీటి సంపులో దూకి యువతి బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన గురువారం సాయంత్రం మదనపల్లి మండలంలో కలకలం రేపింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెంచుపాడు గ్రామం, పందివారిపల్లెకు చెందిన శాంతమ్మ మల్లికార్జున రెండేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటినుంచి తన తమ్ముడిని పోషించుకుంటున్న భారతి(15) తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరి జీవితాన్ని వెలదీస్తోంది. ఇంతలో ఆ పసికందుకు ఏం కష్టం వచ్చిందో ఏమో తన అక్క గారి ఇంట్లో ఉండడం ఇష్టం లేక  గ్రామానికి ఆనుకుని ఉన్న నీటి సంపులో దూకి ఆత్మ హత్య చేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చిరికి తరలించారు. కాగా భారతి ఆత్మహత్య చేసుకున్న చనిపోయిందా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఎం శేఖర్ తెలిపారు.

 

Post Midle

Tags; A young woman committed suicide by jumping into a water tank

Post Midle