A young woman jumps into the Kakatiya canal

కాకతీయ కాలువ లో దూకిన యువతి

-ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు

Date:05/08/2020

కరీంనగర్ ముచ్చట్లు:

పోలీసులు, స్థానికుల చాకచక్యంతో ఒక యువతి నిండు ప్రాణం దక్కింది.  కుటుంబ కలహాల నేపథ్యంలో  తిమ్మాపూర్ మండలం అల్గునూరు శివారులోని కాకతీయ కాలువ లో  ఒక యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బుధవారం ఉదయం గంటలకు కరీంనగర్ పట్టణం కు  చెందిన మహిళ  ఆత్మహత్య చేసుకోవాలనే ఉదేశ్యంతో కాకతీయ కెనాల్ లో దూకింది.  నీటి ప్రవాహానికి కొట్టుకొని పోతున్న ఆమెను అటుగా వెళ్తున్న స్థానికులు సుందరగిరి సతీష్, దుండ్ర. ఎల్లయ్యలు నీటినుండి బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.  స్పందించిన ఎల్ఎండీ  ఎస్ఐ కృష్ణారెడ్డి, బ్లుకోల్ట్స్ హోంగార్డ్ లక్ష్మీనారాయణలు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీస్ వాహనంలో కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు.  ఆ మహిళను కాపాడిన  సుందరగిరి సతీష్, దుండ్ర ఎల్లయ్య లను ఎస్ఐ కృష్ణారెడ్డి  అభినందించారు.

బీరుట్ గాయాలులో భారీ పేలుళ్లు..      50 మంది మృతి.. 2750 మందికి

Tags: A young woman jumps into the Kakatiya canal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *