Natyam ad

ప్రేమించడం లేదని యువతిపై బ్లేడ్‌తో దాడి

సంగారెడ్డి అర్బన్‌ ముచ్చట్లు:

సంగారెడ్డిలో యువతిపై ఓ యువకుడు బ్లేడ్‌తో దాడి చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మనూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన తెనుగు అఖిల(21), నారాయణఖేడ్‌ పరిధిలోని పోతంపల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ (22)కు వరుసకు కోడలు అవుతుంది.యువతి ఈరోజు సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్‌ కళాశాల ఆవరణలోనే తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో యువతి మెడ, చేతులపై దాడి చేశారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తోటివిద్యార్థులు అప్రమత్తమై ప్రవీణ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ప్రాథమిక చికిత్స అనంతరం అఖిల పరీక్ష రాసింది. అనంతరం పోలీసులు ఆమె పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. తనను ప్రేమించడంలేదనే అక్కసుతోనే యువతిపై ప్రవీణ్‌ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

Post Midle

Tags: A young woman was attacked with a blade for not loving her

Post Midle