Natyam ad

పోలీసులమని బెదిరించి యువతిపై అత్యాచారం

మచిలీపట్నం ముచ్చట్లు:

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన యువకులు  అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత యువతి న్యూడ్ వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.అయితే, సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మచిలీపట్నానికి చెందిన ఓ యువతి ఇటీవల రాత్రి సమయంలో పనిముగించుకొని ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో బైక్ పై వచ్చిన యువకులు పోలీసులమని చెప్పి బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లారు.స్థానికంగా ఉన్న చిలకలపూడి రైల్వే స్టేషన్ వెనక ఖాళీ స్థలంలోకి యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు. యువతిపై దారుణానికి పాల్పడి న్యూడ్ వీడియోలు తీశారు. యువతి ఫోన్ కూడా లాక్కున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే న్యూడ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని యువతిని బెదిరించారు.

 

 

ఘటన జరిగిన తర్వాత రోజు తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఓ యువకుడు తన ఇంటి ముందు నుంచే వెళ్తుండటాన్ని బాధితురాలు గుర్తించింది. వెంటనే బంధువుల సాయంతో ఆ యువకుడ్ని పట్టుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసారు. నిందితుడు సుకర్లాబాద్ చెందిన నారాయణగా గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక రెండవ నిందితుడికోసాం పోలీసులు గాలింపు ప్రారంభించారు. అదుపులో వున్న నిందితుడినుంచి యువతి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: A young woman was raped by threatening to call the police

Post Midle

Leave A Reply

Your email address will not be published.