ప్రావిడెంట్‌ ఫండ్‌ నుంచి ప్రయోజనాలను పొందాలంటే ఆధార్‌కార్డు తప్పనిసరి

న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఉద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్‌ నుంచి ప్రయోజనాలను పొందాలంటే తమ యూఏఎన్‌ నంబర్‌కు ఆధార్‌కార్డు సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానించాలి. లేదంటే యజమాని వాటా సంబంధిత ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో జమ కాదని అధికారులు తెలిపారు. ఈ కొత్త నిబంధన ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. పీఎఫ్‌ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఆన్‌లైన్‌ సేవలను ప్రోత్సహిస్తున్నామని వారు చెప్పారు. ఖాతాదారుడిని గుర్తించడానికి ఆధార్‌కార్డు నంబర్‌ను అనుసంధానించాలని కోరుతున్నామని తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Aadhaar card is mandatory to avail benefits from the Provident Fund

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *