Natyam ad

రామసముద్రంలో ఓటర్‌కార్డుకు ఆధార్‌లింక్‌ తప్పనిసరి

రామసముద్రం ముచ్చట్లు:

ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నికల అధికారులు ఉత్తర్వుల మేరకు తమ ఓటరు కార్డుకు తమ ఆధార్‌నెంబరు, ఫోన్‌నెంబరును లింక్‌ చేసుకోవాలని తహశీల్ధార్‌ శా తెలిపారు. శనివారం మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న ఓటరుకార్డుకు ఆధార్‌లింక్‌ చేస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ మాట్లాడుతూ మండలంలో 36,654 ఓటర్లు ఉన్నారని , అందులో ఇప్పటి వరకు 10,880 ఓటర్లకు లింక్‌ చేసినట్లు చెప్పారు. ఇంకా 15,774 ఓటర్లు లింక్‌ చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా తమ ఆధార్‌లింక్‌ను సంబంధిత రెవెన్యూ సిబ్బంది దగ్గర చేయించుకోవాలన్నారు. సిబ్బంది సైతం గ్రామాల్లోకి వెళ్లి త్వరితగతిన ఆధార్‌లింక్‌ పూర్తి చేయాలన్నారు. ప్రజలు కూడ రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌వోలు జగదీష్‌, రెహమాన్‌, నాగభూషణమ్మ, ఎన్నికల ఆపరేటర్‌ నరేన్‌, వీఆర్‌ఏలు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Aadhaar link is mandatory for Ottercard in Ramasamudra

Post Midle

Leave A Reply

Your email address will not be published.