Natyam ad

ఆధార్ అనుసంధాన ప్రక్రియను చేపట్టాలి

కడప ముచ్చట్లు:

ఓటరు ఐడి కార్డుకు ఆధార్ కార్డు నెంబన్ ను అనుసంధానం చేసే ప్రక్రియను.. తమ వంతు బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు.. రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో..  మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు.. జేసీ సాయికాంత్ వర్మతో కలిసి పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నకిలీ ఓట్లను అరికట్టడం, బోగస్‌ ఓటర్‌ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైందన్నారు. ఇందులో భాగంగా.. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల దిద్దుబాటు, అడ్రెస్ మార్పు తదితర అవసరాలకు సంబంధించిన కొత్త దరఖాస్తుల విధానం అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు.

 

 

Post Midle

ఈ ఆధార్ అనుసంధాన ప్రక్రియ ద్వారా.. ఓటర్లు తమ పేర్లలో, కుటుంబ సభ్యుల పేర్లలో, వయస్సులో, చిరునామాలో తేడాలు ఉంటే సరి చేసుకోవాలని ఈ అవకాశాన్ని జిల్లాలోని ఓటర్లు వినియోగించు కునేలా రాజకీయ పార్టీల ప్రతినిధు లు ప్రజలను ప్రోత్సహించాలన్నారు.
ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడి కార్డులను లింక్ చేయడానికి భారత ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఓటర్లు 1950 నంబర్‌కు కాల్ చేసి ఆధార్ నంబర్‌తో పాటు తమ ఓటర్ ఐడీ వివరాలను అప్ లోడ్ చేసుకునే సదుపాయం ఉందన్నారు.
కాగా ఎన్నికల సంఘం నిర్వహించే పోర్టల్‌, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా, ఫోన్ ద్వారా ఆధార్ తో ఓటర్ ఐడీలను అనుసంధానం చేసుకోవచ్చనే.. విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు గుర్తెరిగి ప్రజలను చైతన్య పరచాలన్నారు.అంతే కాకుండా బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా.. ఓటర్ల మొత్తం సమాచారాన్ని సేకరించి, ఓటర్ ఐడి కార్డుతో ఆధార్ కార్డుని లింక్ చేయడం జరుగుతుందన్నారు.పార్టీల ప్రతినిధులు తమ పరిధిలోని ప్రజలకు ఈ సౌకర్యం కల్పించేందు కు ఎప్పటికప్పుడు అవగాహనా క్యాంపులు కూడా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించాలన్నారు.
ఎన్నికల సంఘం  కొత్త నిబంధనల ప్రకారం ఏడాదిలో నాలుగు సార్లు 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి ఓటరుగా జాబితాలో పేరును నమోదు చేసే అవకాశం ఉంద న్నారు

పోస్టర్ల ఆవిష్కరణ

కార్యక్రమంలో భాగంగా ఓటర్ కార్డుతో ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేసే ప్రక్రియకు సంబంధించి ప్రజల్లో అవహగహన పెంపొందించేందుకు ఎన్నికల సంఘం విడుదల చేసిన పోస్టర్లను జిల్లా కలెక్టర్.. జేసీ, పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్వో రామ్మోహన్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శివారెడ్డి, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మణరావు (బీజేపీ), కాంగ్రెస్ , వెంకటశివ (సీపీఐ), హరిప్రసాద్ (తెదేపా), నీలి శ్రీనివాసరావు (ఐఎన్ సి) లతో పాటు వైసిపి నుండి కార్పొరేటర్లు షఫీ, మల్లికార్జున, పాకా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Aadhaar linking process should be done

Post Midle