రాజమహేంద్రవరం నుండి ఆదిరెడ్డి భవానీ ఘన విజయం

Date:23/05/2019

రాజమాండ్రి  ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ తరపున రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన సమీప అభ్యర్ధి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావుపై 32 వేల భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో రాజమహేంద్రవరం తిలక్‌ రోడ్డులోని ఆమె నివాసం వద్ద ఆనందంలో ఆదిరెడ్డి అభిమానులు సందడి చేశారు. ఎన్నికల కౌంటింగ్‌లో మొదటి నుండి ఆధిక్యత కనబరుస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు క షి, ఆదిరెడ్డి కుటుంబం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల సందించడం వల్లే ప్రజలు ఆ కుటుంబానికి అండగా నిలిచి గెలిపించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదిరెడ్డి వాసు చూపించిన చొరవ, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి కుమార్తె ఆదిరెడ్డి భవాని చరిస్మా కలసి ఆమెను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా తిరుగులేని మెజారిటీ సాధించిపెట్టాయి.

 

 

 

 

దీంతో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి అభిమానుల్లో ఉత్సాహం వచ్చింది. కాగా సిక్కోలు సింహంగా శ్రీకాకుళం జిల్లా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ఎంపీ, తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన కింజరాపు ఎర్రన్నాయుడి ముద్దు బిడ్డగా, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే ఆదిరెడ్డి కుటుంబం కోడలిగా ఆదిరెడ్డి భవానీ విజయం సాధించడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉండటమే కాకుండా… భవానీ ఛారిటబుల్‌ ట్రసు ్ట ద్వారా ఈ కుటుంబం చేయని సహాయం లేదు. లేదు అనకుండా ఏ సహయార్ధుడిని వెనక్కి పంపిన దాఖలాలు లేవు. పేద విద్యార్ధులకు ఫీజులు, పలువురికి వైద్య ఖర్చు సహాయం అందించడం…

 

 

ఇలా అనేకం ఈ ఇంటి సొంతం. ఇక రాజకీయ నేపధ్యానికి వస్తే ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా ప్రజలకు  నిస్వార్ధం సేవలందించారు. అలాగే ఆదిరెడ్డి వీరరాఘవమ్మ రాజమహేంద్రవరం తొలి మహిళా మేయర్‌గా నరగపాలక సంస్థకు ఎన్నికై ఐదేళ్లు నగర ప్రజలకు చేసిన సేవ అజరామం. ఇక భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)కు యువతలో మంచి పేరుంది. అందరితో కలుగోపుగా మాట్లాడడం, ప్రేమగా పలుకరించడం, ప్రతి ఒక్కరితో మర్యాధగా మసులుకోవడం ఆయన నైజం. ఇవన్నీ ఆదిరెడ్డి భవానీకి బలం చేకూర్చాయి.

 

 

 రెండు చోట్ల ఓడిపోయిన పవన్

Tags: Aadi Reddy Bhavani from Rajamahendravaram is a great success

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *