Natyam ad

పిల్లలను వదిలేసిన తండ్రి

కర్నూలు ముచ్చట్లు:

 

కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను ఆటోలో భర్త కృష్ణ తన వెంట తీసుకెళ్లాడు. అయితే.. దారిలోనే ప్యాలకుర్తి దగ్గర ఆటోతో సహా పిల్లలను కాలువలో పడేసి తండ్రి పరారయ్యాడు. కాలువలో నీరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాలువలో పిల్లలు ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో పిల్లలని రక్షించారు. కాలువలో పడేసిన తండ్రి కోసం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

 

Tags: Abandoned father

Post Midle
Post Midle