ఆడ శిశువును వదిలివెళ్లిన తల్లి

ఖమ్మం ముచ్చట్లు:

.ఖమ్మం మాత శిశు సంరక్షణ కేంద్రం ఉయ్యాలలో పసి బిడ్డను గుర్తు తెలియని వారు వదిలి వెళ్ళిన ఘటన చోటు చేసుకుంది.అయితే ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు.  నవ మాసాలు మోసి పురిటినొప్పులు భరించి కన్న తన బిడ్డనే వద్దనుకుందన్న ఆ ఘటన పలువురిని కంటతడి చెట్టిస్తుంది.అభం శుభం తెలియని  పసిగుడ్డును అనాథగా వదిలేసి వెళ్లరు.ఆ తల్లి ఎంతైనా తన మాతృప్రేమ కనిపిస్తుంది. తాను వదిలించుకున్నా బిడ్డ క్షేమంగా జీవించాలనుకుంది ఆ తల్లి.. అందుకేనేమో చెట్ల పొదల్లో, రోడ్డు మీద కాకుండా ఖమ్మం మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ‘ఊయల’లో వదిలి వెళ్లింది.
నెలలోపు వయసున్న ఆ పాప ఏడుస్తుండగా సెక్యూరిటీ వారు గమనించి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి పరిసరాల్లో విచారించగా తల్లిదండ్రుల ఆచూకీ లభించలేదు. దీంతో పీడియాట్రిక్ విభాగం వైద్య నిపుణులు నవజాత శిశు చికిత్స కేంద్రానికి (ఎస్ఎన్సీయూ) తీసుకెళ్లారు. శిశువుకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనారోగ్య సమస్యలు లేవని క్షేమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీనితో మహిళా శిశు సంక్షేమశాఖ డీడబ్ల్యూఓ సుమ, డీసీపీఓ విష్ణువందన ఆస్పత్రికి వెళ్లి శిశువును పరిశీలించి శిశుగృహంకు తరలించారు.
అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూ టౌన్  పోలీసులు కేసు నమోదు చేసారు. . శిశువుకు తామే ఆశ్రయం కల్పిస్తామని.. తల్లిదండ్రుల వివరాలు  లభించని పక్షంలో అనాథగా ప్రకటించి నిబంధనల ప్రకారం దత్తత ఇస్తామని డీడబ్లూఓ అధికారి సుమ స్పష్టం చేశారు.

Tags: Abandoned mother of baby gir

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *