Natyam ad

పుంగనూరులో అబ్ధుల్‌కలామ్‌ అవార్డులుప్రధానం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని డాక్టర్‌ ఏపిజె అబ్ధుల్‌కలామ్‌ చారిటబుల్‌ ట్రస్ట్ వారిచే విశిష్ట సేవలు అందించిన పలువురు అధికారులకు అవార్డులు ప్రధానం చేశారు. సోమవారం స్థానిక బసవరాజ హైస్కూల్‌ ట్రస్ట్ చైర్మన్‌ అయూబ్‌ఖాన్‌, కార్యదర్శి టి.పి.ఎస్‌.నాగరాజ కలసి అవార్డులు పంపిణీ చేశారు. అవార్డులు అందుకున్నవారిలో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌, తహశీల్ధార్‌ సీతారామన్‌, సీఐ రాఘవరెడ్డి, ప్రిన్సిపాల్‌ దయానందరాజు, ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజుతో పాటు న్యాయవాది కుమార్‌రెడ్డి, టీచర్‌ హేమాద్రి, వ్యాపారి రాము, విశ్రాంత డిఎస్పీ సుకుమార్‌బాబు, వ్యాపారవేత్త త్రిమూర్తి లకు అవార్డులు పంపిణీ చేశారు. వీరికి పూలమాలలు వేసి, శ్యాలువలు కప్పి మెమెంటోలను, సర్టిపికెట్లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గిరిధర్‌, సతీష్‌కుమార్‌, శ్రీనివాస్‌, ప్రకాష్‌, భద్రయ్య, పరమేష్‌, రజీఅహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Abdul Kalam Awards in Punganur is the main one

Post Midle