బోయకొండలో శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు
– పూజలకు తరలివచ్చిన భక్తులు
– ఉచిత అన్నదానం కేంద్రం ఏర్పాటు
చౌడేపల్లె ముచ్చట్లు:

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. వేకువ జామున ఆలయాన్ని శుద్దిచేసి అమ్మవారి గర్బాలయంకు మామిడి, వేపాకు, పూలతోరణాలతో ముస్తాబుచేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నా గరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి ల ఆధ్వర్యంలో రాహుకాల సమయం10:30 గంటలనుంచి 12 గంటల మద్యలో రాహుకాల అభిషేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చిన అమ్మవారికి పూజలు చేయించారు. ఊహించని రీతిలో ఆలయంలో అభిషేక పూజలకు రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
అన్నదానం కేంద్రం ఏర్పాటు……
ఉచిత అన్నదానం కేంద్రాన్ని ఆలయ కమిటి చైర్మన్ నాగరాజ రెడ్డి, ఈఓ చంద్రమౌళిలు శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ప్రతి శుక్రవారం సుమారు200 మందికి అన్నదానం ఏర్పాటుచేశామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్‌లు రాజేష్, బుడ్డమ్మ, రజని, భారతి, రెడ్డెమ్మ, హైమావతి, భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
Tags: Abhisheka Puja of Shdma•ktanga Rahuka in Boyakonda
