Natyam ad

భక్తిశ్రద్దలతో అమ్మవారికి రాహుకాల అభిషేక పూజలు

చౌడేపల్లె ముచ్చట్లు:


కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ దైవంగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మకు శుక్రవారం భక్తిశ్రద్దలతో రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయంను శుధ్దిచేశారు. మామిడి, వేపాకు తోరణాలు, పూలతో ముస్తాబుచేశారు. రాహుకాల సమయంలో సాంప్రదాయరీతిలో అర్చనలు,అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం బంగారు ఆభరణాలు, పూలతో అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిల ఆధ్వర్యంలో భక్తులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

 

Tags: Abhisheka Puja to Goddess with devotion

Post Midle
Post Midle