ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం
కోరుట్ల, ముచ్చట్లు:

పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయంలో జైహనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి మండల దీక్షలో భాగంగా మంగళవారం హనుమాన్ దీక్ష పరులు స్వామి వారి ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకం చేసారు.ఆంజనేయ స్వామి మూలవిరాట్టుకు జిల్లేడు పూలదండలు,తమలపాకుల దండలు వేసి సిందూర లేపనం చేసి అలంకరించారు.
స్వాములు భక్తి పాటలు పాడుతూ సామూహిక చాలీసా,దండకం పారాయణం చేసారు.కార్యక్రమంలో గురుస్వాములు జంగం అనీల్,శ్రీపాద శ్రీకాంత్,బెజ్జారపు రంజిత్,తెడ్డు గంగారాం,
ఇందూరి విజయ్,పెద్ది అనీల్, చక్రపాణి,రమేష్,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు
Tags;Abhishekam to Anjaneya Swami with Panchamrits
