కోర్కెలు తీర్చే గంగమ్మకు అభిషేకపూజలు

చౌడేపల్లె ముచ్చట్లు:

కోరిన కోర్కెలు తీర్చుతున్న బోయకొండ గంగమ్మకు శుక్రవారం భక్తిశ్రద్దలతో రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయంను శుధ్దిచేశారు. రాహుకాల సమయంలో సాంప్రదాయరీతిలో అర్చనలు,అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అభిషేక పూజలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిల ఆధ్వర్యంలో పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

 

Tags: Abhishekapujas to Gangamma who fulfills desires

Leave A Reply

Your email address will not be published.