ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

42 అంశాలకు అమోదం

తాడేపల్లి ముచ్చట్లు:


శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. 42 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వైద్యారోగ్య పోస్టుల భర్తీకి  కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఈ నెల 27న  అమ్మ  ఒడి నిధులకు ఆమోదం తెలిపింది. జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర,  కాపు నేస్తం పథకాలకు, రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఆదానీ గ్రీన్  ఎనర్జీ ప్రాజెక్టు, దేవాలయాల కౌలు భూముల పరిరక్షణ చర్యలపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.216 కోట్లు మంజూరు చేసింది. అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం, జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

Post Midle

Tags: abinet meeting concluded

Post Midle
Natyam ad