సనాతన ధర్మం పాఠాలు రద్దు
చెన్నై ముచ్చట్లు:
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని పూర్తిగా నిర్మూలించాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ లాంటిది, కాబట్టి దీనిని నిర్మూలించాలి, వ్యతిరేకించకూడదు అంటూ మాట్లాడారు. ఆ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి ఉదయనిధిపై దేశంలోని హిందూ సంఘాలు, బీజేపీతో పాటు పలు పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి.ఇదిలా ఉండగా.. స్టాలిన్ సర్కారు మరో సంచలన నిర్ణయానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. స్కూల్ పాఠ్యాంశాల నుంచి సనాతన ధర్మం పాఠం తొలగించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీని గురించి తమిళనాడు విద్యాశాఖ మంత్రి మహేష్‌ను ప్రశ్నించగా.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామంటూ మంత్రి కవర్ చేశారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. సనాతన ధర్మం పాఠాలు తొలగిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హిందూ సంఘాలు, బీజేపీ హెచ్చరిస్తున్నాయి.

Tags: Abolition of Sanatana Dharma lessons
