రెండు సార్లు బాలికకు అబార్షన్

Date:22/11/2019

అనంతపురం ముచ్చట్లు:

ఓ కామాంధుడి మాయమాటలకు ఇంటర్ బాలిక జీవితాన్ని నాశనం చేసుకుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన యువకుడు ఆమెను లైంగికంగా లోబరుచుకున్నాడు. రెండు గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడు. చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది.అనంతపురం జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని ఓ పంచాయతీ పరిధిలోని కుగ్రామానికి చెందిన ఓ బాలిక సమీపంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్ చదువుతోంది. గ్రామం నుంచి కాలేజీకి రోజూ వ్యాన్‌లో వెళ్లేది. దానికి డ్రైవర్‌గా ములకలచెరువు మండలం దాసిరెడ్డిగారిపల్లెకు చెందిన మల్లికార్జున పనిచేసేవాడు. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న మల్లికార్జున ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాలాసార్లు ఆమెను కాలేజీకి తీసుకెళ్లకుండా తన ఫ్రెండ్స్ రూమ్‌కి, నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వాంఛ తీర్చుకునేవాడు.ఈ క్రమంలోనే బాలిక రెండుసార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని ఇటీవల కోరడంతో మల్లికార్జున ససేమిరా అన్నాడు. దీనికి తోడు అతడిని హైస్కూల్ చదువుతున్న పిల్లలున్నారని తెలుసుకున్న బాలిక తాను మోసపోయానని తెలుసుకుంది. దీంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మల్లికార్జునపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

 

మేనకోడలిపై ఐదేళ్లుగా అత్యాచారం

 

Tags:Abortion for the girl twice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *