మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల గైర్హాజరు

వైద్యం అందక గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి

మడకశిర ముచ్చట్లు:


మడకశిర పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సమయానికి వైద్యం అందక ఈరోజు ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక వైద్యులు ఎవరు లేకపోవడంతో ఎంతోమంది రోగులు అబాసు పాలవుతున్నారు. ఈ రోజు మండలం లోని వై బి హళ్లి గ్రామానికి చెందిన రంగదామప్ప అనే వ్యక్తికి ఉదయం గుండెపోటు రావడంతో అంబులెన్సు 108 వాహనం ద్వారా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి వారి కుటుంబీకులు తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు ఎవరు రాక లేకపోవడంతో ఆసుపత్రి నర్సులు అతనిని పరిశీలించి ఇక్కడ వైద్యులు ఎవరు లేరని హిందూపురానికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ నుండి హిందూపురంనకు అంబులెన్సు ద్వారా తీసుకెళ్తుండగా మడకశిర పట్టణం దాటకుండానే ఆయనకు శ్వాస తీసుకోవడం కస్టమవ్వడంతో అంబులెన్సు మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి వెనుకకు రావడంతో అప్పటికే అయన మృతి చెందినట్లు అక్కడ వున్న ట్రైనీ వైద్యుడు ఒకరు  సూచించారు. అయనకు వైద్యం అందక మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు పర్యంత మయ్యారు. ఏది ఏమైనా స్థానిక వైద్యులు లేకపోవటం వలన రోజు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా సంబంధిత అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవటంతో తాలూకా ప్రజలు మరియు రోగులు అత్యంత అవస్థలు పడుతున్నారు.

 

Post Midle

Tags: Absence of doctors at Madakashira Government Hospital

Post Midle
Natyam ad