మంత్రి అనిల్ కు నిరుద్యోగ సమస్యలపై ఏబీవీపీ వినతి

నెల్లూరు ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  జలవనరుల శాఖ మం  అనిల్ కుమార్ యాదవ్ కు స్థానిక నిరుద్యోగుల సమస్యలపై ఏబీవీపీ నాయకులు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు  మంత్రి నివాసంలో ఏబీవీపీ నేతలు పలు సమస్యలను మంత్రి అనిల్ దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు నగర శాఖ ఆద్వర్యంలో నెల్లూరు నగర శాసనసభ్యులు, రాష్ర్ట మంత్రి  పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ని కలిసి నిరుద్యోగుల సమస్యలు, సమగ్రమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. అన్న వస్తే జాబ్ వస్తుందని ఆశించిన నిరుద్యోగ యువతకు ఎదురుచూపులే మిగిలాయి అని తమ ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ సంతృప్తికరంగా లేదన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా సమగ్రమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాజశేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: ABVP appeals to Minister Anil on unemployment issues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *