కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ
హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఏబీ విపి నాయకులు శుక్రవారం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడి చేసారు. వారంతా భారీర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏబీవీపీ నేత సురేష్ కమల్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంలో సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శులను అనిత రామచంద్రన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి. పేపర్ లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు…
Tags;ABVP besieged the collector’s office
