ఏరియా ఆసుపత్రిలో ఎసిబి తనిఖీలు

Date;27/02/2020

ఏరియా ఆసుపత్రిలో ఎసిబి తనిఖీలు

శ్రీకాళహస్తి  ముచ్చట్లు

శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో ఏసీబీ బృందం తనిఖీలు చేపట్టింది. వైద్య పరికరాలు, మందులు కొనుగోలు  వినియోగం తదితర అంశాలపై ఆరా తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ తాజాగా ఏరియా హాస్పిటల్స్ లో తనిఖీలు చేపట్టింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ వైద్య శాలలు పై తనిఖీలు చేపట్టారు.
ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్ లో ఏసీబీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.  ఎసిబి ఏ ఎస్ పి  శ్రీనివాసులు డిఎస్పి అల్లా బక్షి సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిధర్,  నాగేంద్ర  తో పాటు పది మంది పోలీసుల బృందం ఏరియా హాస్పిటల్ లో తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్ అవసరాలకు  కొనుగోలు చేసిన వైద్య పరికరాలు మరియు మందులు కొనుగోలు హాస్పిటల్లో  డెవలప్మెంట్ పండ్  కింద చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో సహా అన్ని అంశాలను ఏసీబీ అధికారుల బృందం పరిశీలన చేపట్టారు. బృందం పరిశీలన అనంతరం పూర్తి  వివరాలు వెల్లడి కానున్నాయి

కరిస్తే అంతే సంగతులు (ప్రకాశం)

.Tags;ACB checks at Area Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *