మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్లానింగ్ విభాగంలో ఏసీబీ తనిఖీలు

విజయవాడ ముచ్చట్లు:

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్‌లో‌ అవినీతిపై ఏసీబీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా అధారాలతో అధికారులు ఈరోజు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ విభాగం పై ఏసీబీకి ఇటీవల వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల నెల్లూరు, చిత్తూరు, విజయనగరం, ఏలూరు జిల్లాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయవాడ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారుల తనిఖీలతో టౌన్ ప్లానింగ్‌ లో అవినీతిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

 

Tags: ACB Inspections in Planning Department of Municipal Corporation Office

Leave A Reply

Your email address will not be published.