సచివాలయం పై ఏసీబీ దాడులు  

 కొత్తూరు ముచ్చట్లు:


శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పొన్నుటూరు సచివాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం మధ్యాహ్నం దాడి చేశారు. ఈ దాడిలో పొన్నుటూరు వి ఆర్ ఒ టి. సోమేశ్వరరావు ఒక రైతు నుండి రూ.15000/-లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఏసీబీ సీఐ భాస్కరరావు తెలిపారు. రైతు భూమికి సంభందించి పట్టాదార్ ఈ పాస్ పుస్తకం కోసం ముటేషన్ చేయుటకు రైతు నుండి వి ఆర్ ఒ సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు ఏసీబీ ని ఆశ్రయించడంతో వి ఆర్ ఒ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు సీఐ భాస్కరరావు వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

 

Tags: ACB raids on Secretariat

Leave A Reply

Your email address will not be published.