ACB raids power house SE home

 విద్యుత్ శాఖ ఎస్ఈ ఇంటిపై ఏసీబీ దాడులు

Date:02/12/2020

నెల్లూరు  ముచ్చట్లు:

విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్  విజయ్ కుమార్ రెడ్డి నివాసం పై  ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అయన నెల్లూరు లో సుదీర్ఘకాలంగా విధుల నిర్వహణలో వున్నారు. నివర్ తుఫాన్ లో విద్యుత్  పునరుద్ధరణ లో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినట్లు ఆరోపణలు వచ్చాయి. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న  ఆరోపణలతో ఏసీబీ అధికారులు  దాడులు చేసారు. విజయ్ కుమార్  రెడ్డి ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారుల దాడులు జరిపారని సమాచారం.

 జాతీయ లోక్ అథాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

Tags:ACB raids power house SE home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *