ధాన్యం కొనుగోల్లు వేగవంతం : మంత్రి సోమిరెడ్డి

Accelerate grain purchases: Minister Somireddy

Accelerate grain purchases: Minister Somireddy

Date:13/04/2018
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లాలో రైసుమిల్లుల వద్ద లారీలు నిలిచిపోకుండా కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు జిల్లాలో  ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఉన్నతాధికారులు, రైతు సంఘాల నేతలతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ నెమ్ము, తరుగు పేరుతో రైతులను బ్లాక్ మెయిల్ చేసే రైసు మిల్లర్లపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, మిల్లర్లు ఎవరైనా సరే రైతుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోం.  రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ లేదని అన్నారు.  శ్రీశైలం నుంచి 22 టీఎంసీల నీటిని తెప్పించి జిల్లాలో ఒక్క ఎకరం ఎండకుండా పంట పండించాం.  జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీపీటీ ధాన్యం క్వింటాల్ కి రూ.210 బోనస్ ప్రకటించామని గుర్తు చేసారు. ధాన్యం ఎలా ఉన్నా కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మాటలు చెబుతున్న వారు గతంలో తమ ప్రభుత్వాల హయాంలో గోళ్లు గిల్లుకుంటూ రైతులను గాలికి వదిలేయడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. నోర్లు పారేసుకుంటే ఫలితం లేదు..మీ జీవితంలో రైతుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సందర్భం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో పంటల దిగుబడి రికార్డు స్థాయిలో ఉంది. గోదాములు పట్టని స్థాయిలో దిగుబడులు వచ్చాయిన అన్నారు.  మిరప, కందులు, మినుములు, మొక్కజొన్నలు, జొన్నలు, శనగలు, వరి..ఇలా ఏ ధాన్యాన్ని అయినా ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం.  మొక్కజొన్న రైతులు పంటను ఎక్కడ అమ్ముకున్నా క్వింటాలుకు రూ.200 చొప్పున గరిష్టంగా 100 క్వింటాళ్లకు రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఏమి చేసేందుకైనా మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయన అన్నారు.
Tags:Accelerate grain purchases: Minister Somireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *