పర్యాటక పనులు వేగవంతం

Accelerate tourism tasks

Accelerate tourism tasks

Date:24/11/2018
ఏలూరు ముచ్చట్లు:
జిల్లాలో చేపట్టిన పలు పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకశాఖాధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్ధానిక కలెక్టర్ ఛాంబర్లో శనివారం నిర్వహించిన జిల్లా పర్యాటక ప్రోత్సాహక సమావేశమండలికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రకాలువ జలాశయం మాస్టర్ ప్లాన్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును వచ్చే సమావేశం నాటికి సమర్పించాలన్నారు.  ఎర్రకాలువ జలాశయం ప్రాంతాన్ని మూడు విభాగాలుగా విభజించి ఆయా వర్గలకు అందుబాటులో ఉండే విధంగా కాటేజ్ లు నిర్మాణాలు,  ఆధునిక బోటింగ్ సౌకర్యం, విభిన్న హ్యాండీక్రాప్ట్స్ స్టాల్స్ రెస్టారెంట్  తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు తగిన విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన ప్లాన్ ను బికెతాతి కన్సెల్టెన్స్ రూపొందించిన డిజైన్స్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించగా వాటిలో మరింత మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు. కుంచనపల్లి వద్ద వేసైడ్ ఎమ్యునిటీస్ కు సంబంధించి టెండర్ల్ ప్రక్రియ పూర్తి అయిన దృష్ట్యా తదుపరి చర్యలను త్వరితగతిన చేపట్టాలన్నారు. కొవ్వూరు పట్టణం వద్ద గోదావరి ముఖ ద్వారంలో రూ.7.75 కోట్లతో చేపట్టిన పర్యాటన అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికపై పూర్తి చేసేందుకు చర్యలు   తీసుకోవాలన్నిరు. కొల్లేరు సరస్సును పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు  రూ.187 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టు త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర పర్యాటక మండలి సమావేశంలో అమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సెట్ వెల్ సి.హెచ్. సుబ్బిరెడ్డి టూరిజం డవలప్ మెంట్ కార్పొరేఫన్ ఇఇ ఎస్ శ్రీనివాసరావు, డి.ఎఫ్.ఓ.ఎమ్.శ్రీనివాసరావు, కె. ప్రభాకర్, పర్యాటకశాఖాధికారి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
Tags:Accelerate tourism tasks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *