హార్సిహిల్స్ ఘాట్‌లో ప్రమాదం

– కొండపైకి వస్తున్న బస్సు, ద్విచక్రవాహనం ఢీ
– ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలు

Date:22/10/2019

బి.కొత్తకోట ముచ్చట్లు:

బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిహిల్స్ ఘాట్‌రోడ్డులో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేటకు చెందిన ఆరు మంది యువకులు ద్విచక్రవాహనాలలో మంగళవారం తెల్లవారుజామున హార్సిహిల్స్కు వచ్చారు. కొండపై పర్యటించిన అనంతరం ద్విచక్రవాహనాలలో వెనుతిరిగారు. ఉదయం 7:30 గంటల సమయంలో మదనపల్లె నుంచి హార్సిహిల్స్కు వస్తున్న మదనపల్లె బస్సు కొండ మధ్యలోకి రాగానే కొండ దిగుతున్న ద్విచక్రవాహనం బస్సును ఢీకొన్నాయి. ద్విచక్రవాహనం బస్సు ముందుబాగాన్ని ఢీకొని చక్రం వెనుక ఇరుక్కుపోయింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంలో ఉన్న జాకీర్‌(19) , సాయితరుణ్‌(19) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆర్టీసి బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

వీఆర్‌ఏ మృతి

Tags: Accident at Horsehills Ghat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *