Natyam ad

మొక్కజొన్న ఫ్యాక్టరీలో ప్రమాదం …ఇద్దరు మృతి

కాకినాడ ముచ్చట్లు:

తూర్పుగోదావరి  జిల్లాలోని దేవరపల్లి శివారులో గల పరమేష్ బయోటెక్ మొక్కజొన్న ఫ్యాక్టరీ లో ప్రమాదం చోటు చేసుకుంది.బాయిలర్  క్లీన్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఒడిస్సాకు చెందిన డమా బీరువా(23), తిరుగుడు మెట్ట గ్రామానికి చెందిన గాజుల శ్రీను (26)గా గుర్తించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా మేనేజ్‌మెంట్ కార్మికులను బాయిలర్ క్లీనింగ్‌కు పంపించినట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ అందక అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కాగా పరిశ్రమలోకి మీడియాను అనుమతించేందుకు యాజమాన్యం నిరాకరించింది.

 

Tags: Accident in the corn factory … two dead