Accident on Kotipalli-Yanam Yeti embankment road

కోటిపల్లి-యానాం ఏటి గట్టు రహదారిపై ప్రమాదం

Date:04/12/2020

కాకినాడ    ముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి, యనాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  శుక్రవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు  అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.  దీంతో కారులో ఉన్న వారు మృతిచెందారు. మృతులు యానాం వాసులు విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రసాదరావు, అతని భార్య విశ్రాంత అధ్యాపకురాలు విజయలక్ష్మి .. కుమారుడు సంతోష్‌ చంద్ర ప్రణీత్‌. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. చెరువులోతు పెద్దగా లేకపోయినా.. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. శుభకార్యం ముగించుకొని ఇంటికి తిరిగొస్తూ.. తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు. సంతోష్‌ చంద్ర ప్రణీత్‌ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

Tags:Accident on Kotipalli-Yanam Yeti embankment road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *